![]() |
![]() |
.webp)
ఆర్ ఆర్ ఆర్ మూవీలో "నాటు నాటు" సాంగ్ ఇంత పెద్ద హిట్ అవుతుందన్న విషయం అప్పట్లో నాకు తెలీదు అని చెప్పాడు రాహుల్ సిప్లిగంజ్ ఆలీతో సరదాగా షోలో. ఎందుకంటే ఆ సాంగ్ పాడేటప్పుడు కీరవాణి గారు ఇది జస్ట్ ట్రాక్ మాత్రమే..ఇదే ఫైనల్ కాదు అని చెప్పారు.
మొదట్లో ఈ సాంగ్ ఆర్ ఆర్ ఆర్ మూవీలోది అన్న విషయం తెలియదు. లిరిక్స్ అవీ పాడేటప్పుడు తెలిసింది ఈ మూవీ కోసం పాడుతున్నామని.. అప్పుడు కీరవాణి గారు చెప్పారు. నేను ఈ సాంగ్ పాడిన ఏడాదిన్నర తర్వాత రిలీజ్ అయ్యింది. మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది. నాకు టెన్షన్ గా ఉంది. నా సాంగ్ ఉంటుందా ఉండదా అనే విషయం తెలియదు. అసలే పెద్ద మూవీ..ఎప్పటికప్పుడు డెసిషన్స్ మారిపోతూ ఉంటాయి, వాయిస్ సెట్ అవ్వదేమో అనిపించింది. కానీ దేవుడి దయ వలన తమిళ్, కన్నడ, హిందీలో కూడా నేనే పాడాను. నేను రాంచరణ్ గారికి పాడితే, కాలభైరవ జూనియర్ ఎన్టీఆర్ కి పాడారు. అన్ని భాషల్లో పాడాలనేది కీరవాణి గారి డెసిషన్ మాత్రమే ఇందులో నేను రిక్వెస్ట్ చేసేది ఏమీ లేదు.
ఎందుకంటే రిక్వెస్ట్ చేస్తే బెస్ట్ అవుట్ ఫుట్ అనేది ఇవ్వలేం..ఫైనల్గా మనం ఇండస్ట్రీలో ఉండాలంటే కష్టపడాల్సిందే. కీరవాణిగారు అవకాశం ఇవ్వడమే పెద్ద కాంప్లిమెంట్ నాకు. తర్వాత జనాలలోకి వెళ్ళింది వాళ్ళు కూడా ఈ సాంగ్ ని బాగా రిసీవ్ చేసుకున్నారు అంతకుమించిన కాంప్లిమెంట్ ఏముంది " అన్నాడు రాహుల్ సిప్లిగంజ్.
![]() |
![]() |